జస్టిన్ ట్రూడో రాజీనామా నేపథ్యంలో అనూహ్య పరిణామాల మధ్య కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ( Canada PM Mark Carny ) ఎన్నికైన సంగతి తెలిసిందే.త్వరలో ఎన్నికలు జరగనుండటంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బలమైన టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు కార్నీ.
తాజాగా కొత్త కేబినెట్‌లో సమర్ధులైన వారికి చోటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఇద్దరు భారత సంతతి నేతలకు మార్క్ కార్నీ మంత్రులుగా అవకాశం కల్పించారు.
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్,( Anita Anand ) కమల్ ఖేరాలను( Kamal Khera ) కేబినెట్‌లోకి తీసుకున్నారు.వీరిద్దరూ మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.
తిరిగి వీరిని మార్క్ కార్నీ తన కేబినెట్‌లోకి తీసుకోవడం కెనడా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వీరిద్దరికి ఏ పోర్ట్‌ఫోలియోలు కేటాయించారన్నది తెలియరాలేదు.
తొలుత ప్రధాని ఎన్నికల రేసులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కూడా నిలిచారు.కానీ అనూహ్య కారణాల మధ్య ఆమె వైదొలగడంతో అంతా షాక్ అయ్యారు.

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) 2021 అక్టోబర్‌లో తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అనితా ఆనంద్‌కు అప్పగించారు.2019 అక్టోబర్‌లో అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.

ఇక కమల్ ఖేరా విషయానికి వస్తే.రాజకీయాల్లోకి రాకముందు నర్సుగా పనిచేసిన ఆమె ఇప్పుడు కెనడా ఆరోగ్య శాఖ మంత్రి కావడం విశేషం.న్యూఢిల్లీకి చెందిన కమల్ కుటుంబం ఆమె చిన్నతనంలోనే కెనడాకు వలస వచ్చింది.టొరంటోలోని యార్క్ యూనివర్సిటీలో చదువుకున్న కమల్ ఖేడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2015లో పిన్న వయసులోనే కెనడా పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు.