కొంతమంది తమ తెలివితో పనులు చేసి అందరినీ ఆకట్టుకుంటుంటారు.మరికొందరు టెక్నిక్‌ను ఉపయోగించి పనులను చాలా సులువుగా పనులు పూర్తి చేస్తూ ఆశ్చర్యపరిచేలా చేస్తుంటారు.
సోషల్ మీడియా రాకతో ఈ తరహా వైరల్ వీడియోలు( Viral Videos ) రోజు రోజుకూ పెరుగుతున్నాయి.తాజాగా, ఓ వ్యక్తి ఇస్త్రీ చేసే విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఓ వ్యక్తి తన దుస్తులను ఇస్త్రీ( Ironing Clothes ) చేయాలనుకున్నాడు.కానీ, ఇంట్లో ఐరన్ బాక్స్ అందుబాటులో లేదు.
అయినప్పటికీ, ఎలా అయినా దుస్తులు సరిచేయాలని నిర్ణయించుకున్నాడు.

ఐరన్ బాక్స్ లేకపోయినా, తన క్రియేటివ్ ఐడియా ద్వారా కొత్తగా ఒక మార్గాన్ని అన్వేషించాడు.అందుకోసం, ఇనుప పార( Shovel ) తీసుకొని అందులో అగ్గి నిప్పులు వేసి వేడిచేశాడు.ఆ తర్వాత ఆ వేడెక్కిన పారను తాను ఇస్త్రీ చేయాల్సిన ప్యాంట్‌పై అటూ, ఇటూ నడిపిస్తూ ఎంచక్కా ఇస్త్రీ చేసేశాడు.
దీనివల్ల దుస్తులకు ఐరన్ సులువుగా అయిపోయింది.ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇస్త్రీ ఇలా కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా., పారతో కూడా ఇస్త్రీ చేయొచ్చా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరేమో ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నాడేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా అనేక ఎమోజీలతో, ఫన్నీ కామెంట్లతో వీడియోకు మంచి స్పందన వస్తోంది.ఇలాంటి వీడియోలు సమస్యలపై కొత్త కోణంలో ఆలోచించి వాటికి వినూత్న పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యం మనలో ఉందని నిరూపిస్తాయి.
ఇస్త్రీ చేయడానికి సాధారణంగా ఐరన్ బాక్స్ ఉండాల్సిందే అనే నమ్మకాన్ని చెరిపేసిన ఈ వ్యక్తి, తన సృజనాత్మకతతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.







