విహారయాత్ర కోసం కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లికన్‌కు( Dominican Republic ) వెళ్లిన భారత సంతతి విద్యార్ధిని సుదీక్ష కోణంకి( Sudiksha Konanki ) అదృశ్యమైన సంగతి తెలిసిందే.ఆమె కోసం రెస్క్యూ బృందాలు గత కొద్దిరోజులుగా తీవ్రంగా గాలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆమె కనిపించకుండా పోయిన పుంటా కానా బీచ్ వద్ద సుదీక్షకు చెందినదిగా భావిస్తున్న బట్టలు లాంజ్ చైర్‌పై కనిపించాయి.దీనికి సంబంధించిన ఫోటోలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోణంకి అదృశ్యమైన రాత్రి కనిపించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె చివరిసారిగా ధరించిన దుస్తులను పోలీ ఉన్నట్లుగా ఇవి ఉన్నాయి.ఆ దుస్తులలో ఎలాంటి ట్యాంపరింగ్ సంకేతాలు కనిపించడం లేదు.
సుదీక్ష తన దుస్తులను లాంజ్ చైర్‌పై వదిలివేసి ఆపై బ్రౌన్ కలర్ బికినీలో సముద్రంలోకి వెళ్లి గల్లంతై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఆమె అదృశ్యం( Missing ) అవ్వడం వెనక కుట్ర కోణాన్ని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన అయోవా నివాసి జాషువా రీబ్‌పై( Joshua Riibe ) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసు తీవ్రత దృష్ట్యా అతనిపై పోలీసులు నిఘా పెట్టారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సభ్యుడు విచారణను ముమ్మరం చేయవచ్చని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో ప్రస్తావించింది.రీబ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.విచారణకు తన కుమారుడు సహకరిస్తున్నాడని, కానీ మార్చి 12 వరకు న్యాయ సలహాదారులు లేకుండా జాషువాను పలుమార్లు అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు.

కోణంకి స్వస్థలమైన వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం రీబేను అనుమానితుడు కాదని పేర్కొంది.ఇప్పటి వరకు సుదీక్ష కేసులో విచారణ 8వ రోజుకు చేరుకుంది.వర్జీనియా షెరీఫ్ కార్యాలయం ప్రతినిధి థామస్ జూలియా మీడియాతో మాట్లాడుతూ.
పోలీసుల దర్యాప్తు సమగ్రంగా ఉందన్నారు.వీటిపై తాము ఎఫ్‌బీఐతో కలిసి పనిచేస్తున్నామని, వారు డొమినికన్ నేషనల్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నారని జూలియా పేర్కొన్నారు.
సుదీక్ష కుటుంబ సభ్యులు భారత్‌కు చెందినవారే.ఆమె తల్లిదండ్రులు 2006లో అమెరికాకు వలస వెళ్లారు.సుదీక్ష కోణంకి.పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ అండ్ బయాలాజికల్ సైన్సెస్ చదువుకుంటోందని ఆమె తండ్రి కోణంకి సుబ్బారాయుడు తెలిపారు.2022లో థామస్ జెఫెర్సన్ హైస్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బయోలాజికల్ సైన్సెస్‌లో డిప్లొమా పట్టా పొందారు.