నాకు జోడీగా నటించడానికి హీరోయిన్లు నో చెప్పారు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు వైరల్!

కమెడియన్ సప్తగిరి( Comedian Saptagiri ) ప్రధానపాత్రలో నటించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్.( Pelli Kani Prasad ) అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ( Priyanka Sharma ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Saptagiri Latest Comments At Pelli Kani Prasad Event Details, Saptagiri,saptagir-TeluguStop.com

ఈ సినిమా మార్చి 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా శనివారం చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ను నిర్వహించింది.

ఇందులో పాల్గొన్న సప్తగిరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సప్తగిరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా నిజ జీవితంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడగగా.మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి.

సినిమా వాళ్లకు ఎవరూ పిల్లనివ్వరు.అది నిజం.

Telugu Saptagiri, Heorinepriyanka, Saptagiripelli, Tollywood-Movie

కెరీర్ పరంగా మనం ఎంత మంచి పేరు సంపాదించుకున్నా మనకెన్ని మంచి అలవాట్లు ఉన్న చివరకు మనల్ని సినిమా వాళ్లనే అంటారు.ఒక రకంగా అదీ ఇబ్బందే అని తెలిపారు సప్తగిరి.ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం ఉంటుంది? అని ప్రశ్నించగా.ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో 100 శాతం గ్యారెంటీ ఇస్తాను.

సీన్‌ కు తగిన విధంగా కామెడీ పండింది అని తెలిపారు.కమెడియన్ల పక్కన హీరోయిన్స్‌ దొరకడం కష్టమన్నారు.

ఈ సినిమాను ఎంతమంది హీరోయిన్స్‌ రిజెక్ట్‌ చేశారు? అని ప్రశ్నించగా సప్తగిరి మాట్లాడుతూ.

Telugu Saptagiri, Heorinepriyanka, Saptagiripelli, Tollywood-Movie

మా దర్శకుడు ఒక పెద్ద లిస్ట్‌ చెబుతారు.ఈ కథకు ఆయన మంచి కథానాయికను ఎంచుకోవాలనుకున్నారు.తీరా చూస్తే సప్తగిరి కమెడియన్‌.

కాబట్టి అతని పక్కన చేయమని చెప్పారు.సరే మంచిదమ్మా అనుకున్నాం.

చివరకు మా అదృష్టం కొద్ది ప్రియాంక శర్మ ఓకే చెప్పారు అని తెలిపారు.రాజకీయాలు వదిలేసినట్లేనా? అని అడగగా.రాజకీయాలు వదలడానికి ఏమీ లేదు.ప్రజాసేవ అంటే నాకెంతో ఇష్టం.అనుకోకుండా అప్పుడు ఒక అవకాశం వచ్చింది.త్రుటిలో మిస్‌ అయింది.

భవిష్యత్తులో ఉండవచ్చు.ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు సప్తగిరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube