బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్( Hrithik Roshan ) కు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వార్2 ( War 2 ) సినిమాతో హృతిక్ రోషన్ పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే ఈ స్టార్ హీరో అక్కకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తుండగా ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.హృతిక్ రోషన్ అక్క పేరు సునైనా( Sunaina ) కాగా ఆమె తన మద్యం అలవాటు గురించి చెప్పుకొచ్చారు.
ఒకానొక సమయంలో మానసికంగా బలహీనంగా ఉండటంతో మద్యానికి( Alcohol ) అలవాటు పడ్డానని ఆమె అన్నారు.ఆ సమయంలో నాకు మందు బాగా పనికొచ్చిందని అందువల్ల డ్రింకింగ్ అనేది తన దృష్టిలో చెడ్డది కాదని ఆమె తెలిపారు.
అయితే మద్యం విషయంలో నియంత్రణ కోల్పోతే మాత్రం మద్యం చెడ్డది అవుతుందని సునైనా అభిప్రాయపడ్డారు.ఒకానొక సమయంలో తాను ఆ దశకు చేరుకున్నానని సునైనా తెలిపారు.

ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం తాగుతూ ఉన్న సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.మంచంపై నుంచి కింద పడి కుర్చీపై నుంచి కిందపడి తాను దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయని ఆమె అన్నారు.ఒక దశలో సునైనా మద్యం లేకపోతే ఉండలేని స్థితికి వచ్చారు.ఆ సమయంలో ఆమె తల్లీదండ్రులు కొన్ని షరతులు విధించారు.

అయితే తల్లీదండ్రులు ఎన్ని చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది.అయితే ఆ తర్వాత సునైనా తనంతట తాను మారాలని డిసైడ్ అయ్యారు.నెల రోజుల పాటు మద్యం ముట్టనని శపథం చేసి రీ హేబిటేషన్ సెంటర్ లో చేరి చికిత్స చేయించుకున్నారు.ప్రస్తుతం ఆ వ్యసనం నుంచి పూర్తిస్థాయిలో బయటపడ్డానని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత సునైనా గర్భాశయ క్యాన్సర్ బారిన పడగా దాని నుంచి కూడా కోలుకున్నారు.







