బొప్పాయితో ఫేషియల్.. నెలకు ఒక్కసారి చేసుకున్న అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

బొప్పాయి( Papaya ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాగే చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్స‌హించ‌డంలో బొప్పాయి అద్భుతంగా తోడ్పడుతుంది.

 Wonderful Skin Care Benefits With Papaya Facial Details, Papaya Facial, Papaya F-TeluguStop.com

ముఖ్యంగా బొప్పాయితో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇంట్లోనే ఫేషియల్( Facial ) చేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా మిక్సీ జార్ లో బాగా పండిన కొన్ని బొప్పాయి పండు ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఫేషియల్ ప్రాసెస్ లోకి వెళ్లాలి.

స్టెప్ 1:

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బొప్పాయి పండు ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని క్లెన్సింగ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Honey, Latest, Milk, Papaya, Papaya Benefits, Papaya Facial, Papaya

స్టెప్ 2:

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్‌ చేసుకోవాలి.అనంత‌రం చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

స్టెప్ 3:

ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బొప్పాయి పండు ప్యూరీ, వన్ టీ స్పూన్ పాలు, వన్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్ తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

Telugu Tips, Honey, Latest, Milk, Papaya, Papaya Benefits, Papaya Facial, Papaya

స్టెప్ 4:

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల్లో ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఫేషియ‌ల్ కంప్లీట్ అవుతుంది.ఇంట్లోనే ఈ విధంగా నెలకు ఒకసారి ఫేషియల్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా బొప్పాయిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మృతకణాలను తొలగించి మొటిమల సమస్యను తగ్గిస్తుంది.బొప్పాయి చర్మాన్ని మృదువుగా ఉంచి పొడిబారకుండా సంరక్షిస్తుంది.

బొప్పాయిలోని విటమిన్ ఎ, సి, ఇ వంటి పోష‌కాలు ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడంలో, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపించ‌డంతో తోడ్ప‌డ‌తాయి.బొప్పాయితో ఫేషియ‌ల్ చేసుకోవ‌డం వ‌ల్ల టాన్ తో పాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగిపోతాయి.

డార్క్ స్పాట్స్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube