బొప్పాయితో ఫేషియల్.. నెలకు ఒక్కసారి చేసుకున్న అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

బొప్పాయి( Papaya ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాగే చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్స‌హించ‌డంలో బొప్పాయి అద్భుతంగా తోడ్పడుతుంది.

ముఖ్యంగా బొప్పాయితో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇంట్లోనే ఫేషియల్( Facial ) చేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ లో బాగా పండిన కొన్ని బొప్పాయి పండు ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఫేషియల్ ప్రాసెస్ లోకి వెళ్లాలి.h3 Class=subheader-styleస్టెప్ 1: /h3pఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బొప్పాయి పండు ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని క్లెన్సింగ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

"""/" / H3 Class=subheader-styleస్టెప్ 2:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్‌ చేసుకోవాలి.

అనంత‌రం చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.h3 Class=subheader-styleస్టెప్ 3:/h3p ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బొప్పాయి పండు ప్యూరీ, వన్ టీ స్పూన్ పాలు, వన్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆపై తడి క్లాత్ తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. """/" / H3 Class=subheader-styleస్టెప్ 4: /h3pఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల్లో ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఫేషియ‌ల్ కంప్లీట్ అవుతుంది.

ఇంట్లోనే ఈ విధంగా నెలకు ఒకసారి ఫేషియల్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా బొప్పాయిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మృతకణాలను తొలగించి మొటిమల సమస్యను తగ్గిస్తుంది.

బొప్పాయి చర్మాన్ని మృదువుగా ఉంచి పొడిబారకుండా సంరక్షిస్తుంది.బొప్పాయిలోని విటమిన్ ఎ, సి, ఇ వంటి పోష‌కాలు ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడంలో, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపించ‌డంతో తోడ్ప‌డ‌తాయి.

బొప్పాయితో ఫేషియ‌ల్ చేసుకోవ‌డం వ‌ల్ల టాన్ తో పాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగిపోతాయి.

డార్క్ స్పాట్స్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.