యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) అల్లు అర్జున్( Allu Arjun ) దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టారు.ఇద్దరి మధ్య బావ బావ అని పిలుచుకునేంత చనువు ఉంది.
గతేడాది దేవర( Devara ) సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ను సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు.ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్లపై ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఈ ఇద్దరు హీరోలు తమిళ డైరెక్టర్లపై ఫోకస్ పెట్టడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dileep Kumar ) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా అల్లు అర్జున్ అట్లీ( Atlee ) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తెలుగు హీరోలకు తమిళ దర్శకులు హిట్లు ఇచ్చిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి.

అందువల్ల నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ హిట్లు ఇస్తారనే చర్చ మాత్రం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.బన్నీ, తారక్ ఒకే దారిలో నడుస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తారక్, బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు ఫీలవుతూ ఉండటం గమనార్హం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు.బన్నీ ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్, బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా ఈ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం మరిన్ని సంచలనాలను సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.బన్నీ, ఎన్టీఆర్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.