టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా టాలెంట్ తో ప్రియదర్శి( Priyadarshi ) ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.ప్రియదర్శి రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు.
అయితే కంటెంట్ ప్రాధాన్యత సినిమాలలో ఎక్కువగా నటిస్తూ హిట్లు సాధించడం ప్రియదర్శికి మాత్రమే సాధ్యమవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో ప్రియదర్శి మినహా కంటెంట్ బేస్డ్ సినిమాలతో మరెవరూ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోలేదు.
బలగం,( Balagam ) మల్లేశం,( Mallesham ) జాతిరత్నాలు,( Jathi Ratnalu ) కోర్ట్( Court ) సినిమాల సక్సెస్ లో ప్రియదర్శి కీలక పాత్ర పోషించారు.ఈ సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
కోర్ట్ సినిమా కేవలం రెండంటే రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది.ఈ ఏడాది హిట్ గా నిలిచిన అతికొన్ని సినిమాల్లో ఈ సినిమా ఒకటి.
డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది.

ప్రియదర్శి రాబోయే రోజుల్లో సైతం ఇదే తరహా సినిమాలలో నటిస్తూ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ప్రియదర్శి కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.రాబోయే రోజుల్లో సైతం కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే ప్రియదర్శికి కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ప్రియదర్శి కంటెంట్ ఉన్న సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో లక్ పరీక్షించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.త్వరలో సారంగపాణి జాతకం సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.ప్రియదర్శి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.