రజనీకాంత్( Rajinikanth ) నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా( Jailer Movie ) బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాలో ఆఫర్ అంటూ తనను మోసం చేశారని ఒక నటి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మలయాళ నటి షైనీ సారా( Shiny Sarah ) మాట్లాడుతూ జైలర్ సినిమాలో రజనీ భార్య రోల్ ఇప్పిస్తామని చెప్పి కొంతమంది మోసాలకు పాల్పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.
రజనీకి భార్యగా నటించే ఛాన్స్ ఉన్నట్టు ఒక టీమ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిందని షైనీ సారా తెలిపారు.రజనీకాంత్ భార్య పాత్ర కోసం తాను ఎంపికైనట్టు వాట్సాప్ లో ఒక సందేశం వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.

ఆ మెసేజ్ చూసిన తర్వాత మొదట తాను నమ్మానని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత వాళ్లు నటుల సంఘం సభ్యత్వ కార్డ్ ఉందా అని అడిగారని తాను లేదని చెప్పడంతో అది కూడా తామే ఏర్పాటు చేస్తామని చెప్పారని ఆమె కామెంట్లు చేశారు.రెండు రోజుల తర్వాత సురేష్ కుమార్ అనే వ్యక్తి కాల్ చేసి చీర ధరించి వీడియో కాల్ లోకి రావాలని చెప్పారని షైనీ సారా పేర్కొన్నారు.కాల్ తర్వాత తాను సెలెక్ట్ అయ్యానని చెప్పి సభ్యత్వ కార్డ్ కోసం 12,500 రూపాయలు డిమాండ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

డౌట్ వచ్చి నేను ఆ డబ్బులు చెల్లించలేదని ఆ తర్వాత కనీసం కొంత మొత్తం అయినా పంపాలని కోరారని ఆమె తెలిపారు.ఆ సమయంలో నాకు డౌట్స్ మరింత పెరిగాయన్ షైనీ సారా అన్నారు.ఆ తర్వాత నా తోటి నటీనటులను సంప్రదిస్తే సభ్యత్వం కచ్చితం కాదని చెప్పారని షైనీ సారా వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు.







