ప్రముఖ బ్రిటన్ కాలజ్ఞాని క్రెయిగ్ హామిల్టన్-పార్కర్( Craig Hamilton Parker ) సంచలన జోస్యం చెప్పి అందరినీ షాక్‌కి గురి చేశారు.“మోడర్న్ నోస్ట్రడామస్”,( Modern Nostradamus ) “ప్రళయ ప్రవక్త” అని పిలిచే ఈయన, నార్త్ సీలో చమురు ట్యాంకర్ ప్రమాదానికి( Oil Tanker Crash ) గురైన కొన్ని రోజుల ముందే ఈ భయానకమైన జోస్యం చెప్పడం విశేషం.ఈయన ప్రాచీన భారతీయ జ్యోతిష్య శాస్త్రమైన నాడి జ్యోతిష్యాన్ని( Nadi Astrology ) ఉపయోగించి ప్రపంచంలో జరగబోయే పెనుమార్పులను ముందుగానే అంచనా వేస్తారు.
మార్చి 4న యూట్యూబ్‌లో వీడియో పెట్టిన హామిల్టన్-పార్కర్, త్వరలోనే ఒక చమురు ట్యాంకర్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.“నాకు ఒక నౌక ప్రమాదంలో చిక్కుకున్నట్టు అనిపించింది.చమురు ట్యాంకర్‌కు ఏదో సమస్య వస్తుందని అనిపించింది.
అది చమురు ట్యాంకరో లేదా ప్రయాణికుల నౌకో కావచ్చు, కానీ కాలుష్యం మాత్రం జరుగుతుందని అనిపించింది” అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

ఆయన చెప్పినట్టుగానే సరిగ్గా ఏడు రోజుల తర్వాత, మార్చి 11న ఆయన జోస్యం నిజమైంది.MV సోలాంగ్ అనే కార్గో షిప్, MV స్టెనా ఇమ్మాక్యులేట్ అనే అమెరికా చమురు ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ట్యాంకర్‌లో ఏకంగా 18,000 టన్నుల జెట్ ఫ్యూయల్ ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో స్టెనా ఇమ్మాక్యులేట్ నౌక కిల్లింగ్‌హోమ్ పోర్టులో ఖాళీ కోసం వేచి చూస్తూ ఆగి ఉంది.ఢీకొన్న ధాటికి భారీ మంటలు చెలరేగి పెద్ద పేలుళ్లు సంభవించాయి.

పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పొగ అంతరిక్షం నుంచి కూడా కనిపించింది.రెస్క్యూ సిబ్బంది సోలాంగ్‌లోని 13 మంది సిబ్బందిని కాపాడారు, కానీ ఒక వ్యక్తి మాత్రం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.స్టెనా ఇమ్మాక్యులేట్‌లోని 13 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
క్రెయిగ్ హామిల్టన్-పార్కర్, ఆయన భార్య జేన్ గతంలో కూడా చాలా నిజమైన జోస్యాలు చెప్పారు.కోవిడ్-19 మహమ్మారి, బ్రెక్సిట్, క్వీన్ ఎలిజబెత్ II మరణం, అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం లాంటి పెద్ద సంఘటనలను ఆయన ముందే ఊహించారు.
2024 జులైలో ట్రంప్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.ఆ తర్వాత రెండు రోజులకే, పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒక దుండగుడు ట్రంప్‌ను కాల్చడానికి ప్రయత్నించాడు.
హామిల్టన్-పార్కర్‌కు జోస్యాల మీద ఆసక్తి తన 20 ఏళ్ల వయసులో మొదలైంది.
భారత ఉపఖండానికి ప్రయాణం చేసినప్పుడు ఆయన ప్రాచీన భారతీయ జ్యోతిష్యం గురించి తెలుసుకున్నారు.స్థానిక జ్యోతిష్కులను చూసి ప్రేరణ పొందాడు.
ఆయన చెప్పిన జోస్యాలు నిజం కావడంతో ఆయనను ప్రజలు 16వ శతాబ్దపు ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్‌తో పోలుస్తున్నారు.