నాని తన సినిమాలను థియేటర్ లో నిలబడే చూస్తారా... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఈయన ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు.

 Nani Watch His Movies In Standing Position At Theatres Details, Nani,court, Priy-TeluguStop.com

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన హీరోగా అవకాశాలు అందుకున్నారు.ఇక హీరోగా సక్సెస్ అందుకొని ప్రస్తుతం ప్రొడ్యూసర్గా సినిమాలను నిర్మిస్తూ ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు.

తాజాగా నాని నిర్మాణంలో ప్రియదర్శి నటించిన కోర్టు సినిమా( Court Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Nani, Natural Nani, Priyadarshi, Tollywood-Movie

మార్చి 14వ తేదీ విడుదలైన ఈ సినిమా ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుందని చెప్పాలి.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సినిమా ప్రీమియర్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో వేశారు.

అయితే ఇక్కడ నాని నిలబడి రెండున్నర గంటల పాటు తన సినిమాని చూశారు.నానితో పాటు హీరో ప్రియదర్శి ( Priyadarshi ) కూడా నిలబడి చూశారు.ఇలా నాని ఎందుకు థియేటర్లో నిలబడి సినిమా చూశారు అనే విషయానికి వస్తే…

Telugu Nani, Natural Nani, Priyadarshi, Tollywood-Movie

నాని ఏ సినిమాలో నటించిన అదేవిధంగా ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ గా మారిన ఆ సినిమాల మొదటి షో థియేటర్లో చూసేటప్పుడు తప్పనిసరిగా ఈయన నిలబడే సినిమాలు చూస్తారని తెలుస్తోంది.ఇలా నిలబడి సినిమాలు చూడటానికి కారణం లేకపోలేదు.థియేటర్లో వెనుక వైపు ఉండి నిలబడి చూడటం వల్ల ప్రేక్షకులందరూ కూడా తన సినిమాని ఎలా ఆస్వాదిస్తున్నారో తెలుస్తుందట.అలాగే ప్రతి ఒక్క సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలుసుకోవడం కోసమే నాని ఇలా థియేటర్లో నిలబడి తన సినిమాల ఫస్ట్ షో చూస్తారని తెలుస్తోంది.

ఇక నాని త్వరలోనే హిట్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube