టాలీవుడ్ యంగ్ హీరో నితిన్,( Nithin ) గ్లామరస్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’.( Robin Hood Movie ) టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నితిన్-శ్రీలీల ఫస్ట్ లుక్, టీజర్, గ్లింప్స్ అన్నీ ప్రేక్షకుల్లో సినిమా పై క్యూరియాసిటీ పెంచాయి.

తాజాగా, ఈ మూవీ నుంచి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner ) లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.డేవిడ్ వార్నర్ పాత్ర ఏమిటి? సినిమాలో ఆయన ఎలా కనిపించబోతున్నారు? అనే అంశాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘రాబిన్ హుడ్’ మూవీ టీమ్ తాజాగా రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ ( ISTS ) కాలేజీని సందర్శించింది.అక్కడ విద్యార్థులతో తమ సినిమా గురించి మాట్లాడిన నితిన్, శ్రీలీల, స్టూడెంట్స్‌తో సరదాగా ముచ్చటించారు.

వీరి రాక విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.ఈ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది నితిన్, శ్రీలీల కలిసి ‘వేరెవర్ యు గో’ అనే సాంగ్‌కు వేసిన అదిరిపోయే స్టెప్పులు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ గా డ్యాన్స్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో, మూవీ టీమ్ మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.మరి, మార్చి 28న ఈ సినిమా ఎలాంటి మాస్ ఎంటర్టైనర్‌గా మారబోతుందో చూడాలి!







