పొడి దగ్గు.( Dry Cough ) సీజన్ మారుతున్నప్పుడు వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
దాదాపు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో పొడి దగ్గును ఫేస్ చేసే ఉంటారు.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ ఎంతో అసౌకర్యానికి గురిచేస్తుంది.
రాత్రుళ్ళు నిద్ర కూడా పాడుచేస్తుంది.ఈ క్రమంలోనే పొడి దగ్గు నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్‌ను పాటిస్తే కేవలం రెండు రోజుల్లో పొడి దగ్గు నుంచి రిలీఫ్ పొందవచ్చు.

ఖర్జూరం పాలు పొడి దగ్గుకు చక్కని ఔషధంలా పనిచేస్తాయి.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు అరకప్పు వాటర్ వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానపెట్టుకున్న ఖర్జూరాలను మిక్సీ జార్ లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు( Milk ) పోసుకోవాలి.పాలు బాయిల్ అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఖర్జూరం పాలును సేవించాలి.రోజుకు ఒకసారి ఖర్జూరం పాలను తాగారంటే పొడి దగ్గు దెబ్బకు పరారవుతుంది.

అలాగే పొడి దగ్గును దూరం చేయడానికి మరొక అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) చిటికెడు మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, పావు టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా తీసుకోవాలి.
రోజు ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే దగ్గు తగ్గుముఖం పడుతుంది.జలుబు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.







