మానవత్వం మంట కలిసిన వేళ.. ఇంట్లోనుంచి అత్తమామలను గెంటేసిన కోడలు

కూతురిగా, భార్యగా, తల్లిగా ఓ మహిళ ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుంది.అయితే కొన్ని సందర్భాల్లో ఆ మానవత్వం పూర్తిగా కనుమరుగవుతోంది.

 Viral Video Bengaluru Doctor Assaulting Her Elderly In Laws Police Probe Details-TeluguStop.com

బెంగళూరులో( Bengaluru ) జరిగిన ఒక అమానవీయ ఘటన ఇందుకు అద్దం పడుతోంది.పదేళ్లుగా అత్తమామలకు నరకం చూపిస్తూ, చివరికి వారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ఓ వివాహిత కోడలి క్రూరత( Daughter-in-law Cruelty ) ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.80 ఏళ్ల వృద్ధుడిని, ఆయన భార్యను కర్కశంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు భార్య, పిల్లలు కలిసి కుట్ర పన్నిన తీరుకు నెటిజన్లు విస్తుపోతున్నారు.ఈ అమానుష ఘటనకు కారణమైన ప్రియదర్శిని( Priyadarshini ) అనే వివాహిత బెంగళూరులోని విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా( Doctor ) పనిచేస్తోంది.

ఆమె భర్త జె.నరసింహయ్య.

వీరికి 2007లో వీరి వివాహం జరిగింది.మొదట్లో కుటుంబ జీవితం సఖ్యంగా సాగింది.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక, భర్తతో విభేదాలు పెరిగాయి.ఈ క్రమంలో ప్రియదర్శిని తన అత్తమామలను ఇంట్లో నుంచి పంపించేందుకు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం ప్రారంభించింది.వాస్తవానికి, వారుంటున్న ఇల్లు నరసింహయ్య సొంతం.అయినప్పటికీ తన భర్తను, అతని వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ప్రియదర్శిని కఠినంగా హుకుం జారీ చేసింది.80 ఏళ్ల వృద్ధుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ప్రియదర్శిని అతనిపై జాలి చూపలేదు.తన కొడుకు, కూతురుతో కలిసి ఆ వృద్ధ దంపతులను తిడుతూ, కొడుతూ ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది.ఈ దారుణ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రియదర్శిని అమానుషత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి వారు డాక్టర్ ఎలా అయ్యారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటనపై నరసింహయ్య అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు.వృద్ధులను ఇంత కర్కశంగా వేదించిన ప్రియదర్శినికి, ఆమె కొడుకు, కూతురుకు కఠిన శిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కుటుంబ పరువు, ఆత్మగౌరవాన్ని తుంచిపారేసి వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపైకి నెట్టివేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు.ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటం సమాజంలోని మానవత్వం తగ్గిపోతున్న సంకేతంగా కనిపిస్తోంది.

తల్లిదండ్రులను ఇలాంటి స్థితికి నెట్టడమేనా కొత్త తరం బాధ్యత? ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు విధించి, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube