బుల్లితెర పై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ఒకటి.ఈ షో ద్వారా ఎంతోమంది మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారందరూ కూడా ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న వారిలో రైసింగ్ రాజు(Raising Raju) ఒకరు.
హైపర్ ఆది (Hyper Aadi)టీంలో కమెడియన్ గా కొనసాగుతున్నారు.ఇక హైపర్ ఆది స్కిట్ మొత్తం రైజింగ్ రాజు మీద పంచులు వేస్తూ ఉంటుందని సంగతి మనకు తెలిసిందే.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి హైపర్ ఆది తప్పుకోవడంతో రైజింగ్ రాజు కూడా దాదాపు ఈ కార్యక్రమంలో కనిపించడం లేదు.అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రైజింగ్ రాజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.తాను జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.ముఖ్యంగా తన కూతురి పెళ్లి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చందాలు వేసుకుని తన కుమార్తె పెళ్లి చేశానని ఈయన ఎమోషనల్ అయ్యారు.

ఇక కరోనా సమయంలో షూటింగ్స్ లేవు అదే సమయంలో నా కూతురు డెలివరీ అయింది మనవరాలు పుట్టింది.చిన్న పాప ఇంట్లో ఉండటంతో ఆ టైంలో నేను బయటకు వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందోనని భయం వేసి బయటకు కూడా వెళ్లే వాడిని కాదు.షూటింగ్స్ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను అయితే నేను షూటింగ్ వెళ్లకపోయినా హైపర్ ఆది మాత్రం తనకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇంటికి పంపించేవాడు.ఆ విషయంలో నాకు ఆది చాలా హెల్ప్ చేశాడు నా దృష్టిలో ఆయన నాకు దేవుడితో సమానం అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది గురించి రైసింగ్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







