కొత్తగా పెళ్లైన వారి జీవితంలో శోభనం (Wedding Night)ఒక ప్రత్యేకమైన అనుభవం.కానీ, ఓ కొత్త జంటకు ఈ రాత్రి పూర్తిగా ఊహించని మలుపు తీసుకుంది.
వారు ఊహించని విధంగా బంధువుల ఆటపట్టింపుకు గురయ్యారు.ఉత్తర భారతదేశానికి (North India)చెందిన ఓ వ్యక్తి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శోభనం రోజు(wedding night) రానే వచ్చింది.ఉత్సాహంగా గదిలోకి అడుగుపెట్టిన వరుడు, భార్య కోసం ఎదురుచూస్తుండగా తలుపు మోగింది.
తలుపు తెరిచాడు.కానీ భార్య కాకుండా బంధువుల ‘దండుపాళ్యం బ్యాచ్’ గదిలోకి ప్రవేశించింది.
ఆలా వచ్చిన వారు హాయిగా బెడ్‌పై పడుకుని, వరుడికి ఒక్క అంగుళం కూడా ఖాళీ ఇవ్వలేదు.

దీనితో వరుడు ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఒక కుర్చీలో కూర్చుండిపోయాడు.ఆ తర్వాత గదిలోకి వచ్చిన పెళ్లి కూతురు పరిస్థితిని చూసి షాక్ అయ్యింది.చేసేదేమీ లేక నేలపై దుప్పటి పరుచుకుని కూర్చొంది.
కొద్దిసేపటికి బంధువులంతా హాయిగా నిద్రలోకి జారుకోగా, వరుడు మాత్రం తన మొదటి రాత్రిని తలచుకుంటూ బాధగా కూర్చుండిపోయాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీగా, పలు రకాలుగా స్పందించారు.మొదటి రోజు పోతే పోయిందిలే మిగితా రోజులు ఉన్నాయ్ కదా కృంగిపోకు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో ఇలాంటి దారుణ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదంటూ అతడిపై జాలిగా కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో అయ్యో బాసు ఎంత పని జరిగిపోయే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.







