అన్ని సీజన్ లలో మార్కెట్లో లభించే పండ్లలో ముఖ్యమైనవి అరటి పండ్లు.అరటి పండ్లు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి.
అరటి పండు తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది.అరటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్ లు వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
ఇవి జీర్ణ క్రియల్లో ప్రధాన పాత్ర పోషించారు.అరటి పండు ప్రేగుల కదిలికలను కూడా నియంతిస్తుంది.
అరటి పండ్లు తీసుకుంటే గుండె జబ్బులతో పాటు చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.వాటి ధర కూడా చాలా తక్కువే.
అయితే వీటిని అధికంగా తిన్నా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అరటి పండ్లను మోతాదుకి మించి తింటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.చాలా పోషక విలువలు కలిగిన అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అదే విధంగా ఆరోగ్యం పై చెడు ప్రభావం కూడా ఉంది.
అరటి పండ్లను రోజుకు రెండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అరటిపండు ఎక్కువగా తింటే మలబద్ధకంతో పాటు కొన్ని ఉదర సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
అరటి పండులో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ కు కూడా ప్రేరేపిస్తాయి.కిడ్నీ బాధితులు అరటి పండ్లకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది.
దంత సమస్యలు కూడా ఈ పండుతో వచ్చే అవకాశం ఉంది.డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లు తినకపోవడం మంచిది.ఎందుకంటే ఇందులోనీ ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది.ఎక్కువగా అరటి పండ్లు తింటే త్వరగా బరువు పెరుగుతారు.అరటి పండ్లలోని ఫైబర్ కొందరిలో అజీర్తి, గ్యాస్, కడుపు, ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి.రోజుకు కేవలం రెండు అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అంత కంటే ఎక్కువగా అరటి పండ్ల ను తీసుకోవడం అసలు మంచిది కాదు.