టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య( Naga Chaitanya ) వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.తండేల్ సినిమాతో ( Thandel )నాగచైతన్య భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.అటు నాగచైతన్య ఇటు సాయిపల్లవిలకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పరుచూరి గోపాలకృష్ణ ( Paruchuri Gopalakrishna )ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ తండేల్ చూస్తున్న సమయంలో ఏఎన్నార్ మూగ మనసులు సినిమా గుర్తుకు వచ్చిందని అన్నారు.
తండేల్ సినిమాలో రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.తుఫానుల సమయంలో మత్స్యకారులు జోన్లను గుర్తించడం సులువు కాదని అందువల్ల వేరే దేశాల్లోకి ప్రవేశించాల్సి వస్తుందని పరుచూరి తెలిపారు.

ఈ సినిమా చూసిన తర్వాత నాగచైతన్యకు తగ్గ కథే అని అనిపించిందని పరుచూరి కామెంట్లు చేశారు.హీరో పాత్రకు దర్శకుడు కొంత మాస్ ని జోడించాడని నాగచైతన్య మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు.సాయిపల్లవి అద్భుతమైన నటి అని ఈ సినిమాలో సాయిపల్లవికి( Sai Pallavi ) హీరోకు సమనమైన రోల్ దక్కిందని ఆయన తెలిపారు.

తండేల్ సినిమా సక్సెస్ తో చైతన్య మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిందనే చెప్పాలి.తండేల్ సినిమా సక్సెస్ తో అక్కినేని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.నాగచైతన్య రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.తండేల్ సినిమా సక్సెస్ దర్శకుడు చందూ మొండేటి కెరీర్ కు సైతం ఒక విధంగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.
విభిన్నమైన కథలతో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నారు.