తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ప్రస్తుతం నాగార్జున మాత్రం ఇటు హీరోగా, విలన్ గా పలు రకాల పాత్రలను పోషించు తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆయన 99 సినిమాల్లో హీరోగా నటించాడు.ఇక తన వందో సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ( Lokesh Kanagaraj )లో వస్తున్న కూలీ సినిమాలో విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించి తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి… ఇక ఇప్పుడు రజనీకాంత్( Rajinikanth
) ను ఢీకొడుతూ ఆయన చేస్తున్న పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందట.నాగార్జున పాత్ర డిఫరెంట్ కోణాల్లో ఉండబోతుందట.ఇక స్క్రీన్ మీద దాన్ని చాలా కొత్తగా పండించే ప్రయత్నం చేస్తున్నారు.తద్వారా ఆయనకు విలన్ గా మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడిగా కూడా చాలా మంచి పాత్రల్లో నటించి మెప్పించడానికి కూడా తన రెఢీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా అంటే మామూలుగా ఉండదనే విషయం మనందరికి తెలిసిందే.విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన మరోసారి స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడా లేదా అనేది…
.