పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )కు ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాకుండానే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అయితే ఉంది.
పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ( Pithapuram Jana Sena formation meeting ) స్పీచ్ లో పవన్ వేర్వేరు అంశాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే.అయితే పవన్ తన సినిమాల గురించి మాత్రం అస్సలు రియాక్ట్ కాలేదు.
పవన్ జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ( Harihara Veeramallu Movie ) ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది.నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా మే నెల 9వ తేదీన అయినా కచ్చితంగా విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.

ఓజీ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.పవన్ ఈ సినిమాల షూటింగ్ లను ఎప్పటికి పూర్తి చేస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.పవన్ యాక్టర్ గా సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మరింత ఎదగాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ సాధించినా సినిమాల్లో కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.