ఇంటర్నెట్‌లో రోజుకో కొత్త ట్రెండ్(New trend), రోజుకో ఫన్నీ వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి.అందులో కోతులకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
మనుషులలాంటి చేష్టలు, అల్లరి, చిలిపి పనులతో కోతులు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటాయి.ఇటీవల కోతుల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆహారం కోసం తెగ ప్రయత్నించడం, ఆటపాటలు, హుందాగా నడుచుకుంటూ ఊహించని రీతిలో ప్రవర్తించడం.ఇలా ఎన్నో వీడియోలు ప్రజలను నవ్వులతో ముంచెత్తుతున్నాయి.
కోతులు అల్లరి (Monkeys)చేయడంలో ముందు వరుసలో ఉంటాయన్న సంగతి తెలిసిందే.మనం కూడా ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే ‘కోతి పనులు చేయొద్దు’ అని అంటూ ఉంటాము.
నిజానికి అలా ఎందుకంటామో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.తాజాగా కోతికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒక నిర్మానుష ప్రదేశంలో కొన్ని కోతులు కూర్చుని ఉన్నాయి.అక్కడే ఓ కర్రకు చక్రం జాయింట్ చేసి ఉంది.ఓ కోతి ఆ చక్రంపై ఎక్కి ఆడుకోవాలనుకుంది.కానీ, అప్పటికే అక్కడ మరో చిన్న కోతి పిల్ల వచ్చి చక్రం మీద నిలబడింది.దీంతో మొదట ఎక్కిన కోతి తెలివిగా ఆ చక్రాన్ని బలంగా తిప్పేసింది.చక్రం వేగంగా తిరుగడంతో చిన్న కోతి పిల్ల గుండ్రంగా తిరుగుతూ విలవిలలాడిపోయింది.
ఈ దృశ్యం చూసిన అక్కడున్న కోతులన్నీ షాక్ అయ్యి అక్కడి నుంచి పరుగులు తీశాయి.చివరికి చక్రం వేగం తగ్గిన తర్వాత ఆ చిన్న కోతి దూకేసి బయటపడింది.
ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది.నిజంగానే ఇవి కోతి చేష్టలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరేమో ఇలాంటి కామన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.