జుట్టు ( hair )విపరీతంగా రాలిపోతుందా.? ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడాన్ని అడ్డుకోలేకపోతున్నారా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.? అయితే అస్సలు చింతించకండి.నిజానికి మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్ ను కనుక వాడడం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అన్నారు.

టానిక్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు( Onion skins ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు మరియు ఉల్లి తొక్కలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు కరివేపాకు( Curry leaves ) కూడా వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టానిక్ ని నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను వాడడం అలవాటు చేసుకుంటే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.
హెయిర్ ఫాల్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో ఈ టానిక్ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
పైగా ఈ టానిక్ కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.చుండ్రు సమస్యను సంపూర్ణంగా నివారిస్తుంది.
కురులను దృఢంగా మారుస్తుంది.