టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 (Pushpa 2)సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ఇక త్వరలోనే నితిన్(Nithin), శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన రాబిన్ హుడ్(Robin Hood) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇక ఇటీవల కాలంలో శ్రీ లీల నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఈమెకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా ఎంతో అవసరం అని చెప్పాలి.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి శ్రీ లీల నటి రష్మిక(Rashmika) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేసే సమయంలో రష్మికతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు.

నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదటగా రష్మిక ఎంపికయ్యారు.ఆమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేశారు.అయితే కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీ లీల ఈ సినిమాకు కమిట్ అయ్యారు.ఈ కారణం చేత తాను రష్మికతో మాట్లాడటానికి చాల ఇబ్బంది పడ్డానని తెలిపారు.
అయితే తనకు సినిమా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నానని రష్మిక తెలియజేశారు.అప్పుడు నాకు కాస్త రిలీఫ్ అయిందని అప్పటినుంచి రష్మికతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యానని, చాలా తక్కువ సమయంలోనే మేమిద్దరం క్లోజ్ అయ్యాము అంటూ రష్మిక గురించి శ్రీ లీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.