చైతన్య సమంత (Chaitanya ,Samantha)జోడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం గమనార్హం.
ఏ మాయ చేశావె, మనం, మజిలీ (Ye Maaya Chesave, Majili, Manam) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం గమనార్హం.అయితే చైతన్య సమంత ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.
పెళ్లి తర్వాత మూడేళ్ల పాటు చైతన్య సమంత అన్యోన్యంగా ఉండగా కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.అయితే వీళ్లిద్దరూ విడిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా సమంత చైతూ జ్ఞాపకాలను (Samantha Chaitu’s memories)నెమ్మదిగా చెరిపేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం సమంత నిశ్చితార్థం రింగ్ ను లాకెట్ లా మార్చుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ప్రేమలో ఉన్నప్పుడు సమంత చేతిపై ఒక టాటూను వేయించుకోగా తాజాగా సామ్ ఆ టాటూను సైతం తొలగించుకోవడం గమనార్హం.సమంత తాజాగా షేర్ చేసిన ఫోటోలలో టాటూ క్లియర్ గా కనిపించడం లేదు.సమంత ఇప్పటికే తన టాటూను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు సమంత (Samantha)త్వరలో కెరీర్ పరంగా బిజీ కానున్నారు.

సమంత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను ఫ్యాన్స్ భావిస్తున్నారు.సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.సమంత కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సమంత పారితోషికం ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.సమంత రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
సమంత లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతుండటం గమనార్హం.