ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టవుతాయా?

ప్రతి వారం లాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి.మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయానికి వస్తే.

 Upcoming Movies March Third Week , Shankumha, Pelli Kani Prasad, Tollywood, Movi-TeluguStop.com

ఆది సాయికుమార్‌ ( Adi Saikumar )ప్రధాన పాత్రలో నటించిన డివోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ షణ్ముఖ( Shanmukha ).ఇందులో అవికా గోర్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెలిసిందే.షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు.ఇప్పటి వరకూ ఎవరూ టచ్‌ చేయని ఒక ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు తెలిపారు.ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కమెడియన్ సప్తగిరి ( Comedian Saptagiri )ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్( Pellikani prasad ).అభిలాష్ రెడ్డి ( Abhilash Reddy )దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ వినోదాత్మక సినిమా ఈ నెల 21న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

అలాగే హర్ష్‌ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్‌ మధు, శాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం టుక్‌ టుక్‌( Tuk Tuk ).సి.సుప్రీత్‌ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఆటోని పోలి ఉండే మ్యాజికల్‌ పవర్స్‌ కలిగిన స్కూటర్‌తో ముగ్గురు యువకులు ఎలాంటి ప్రయాణం చేశారన్నది ఈ సినిమా కథ.ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్‌ కానుంది.

Telugu Shankumha, Tollywood, March-Movie

కొత్త దర్శకుడు తారకరామ దర్శకత్వం వహించిన సినిమా అనగనగా ఆస్ట్రేలియాలో.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జరిగింది.జ్యోతినాథ్‌ గౌడ్‌, సాన్యా భట్‌నగర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

సంతోశ్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ఆర్టిస్ట్.రతన్‌రిషి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది.రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ది సస్పెక్ట్‌.

రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

Telugu Shankumha, Tollywood, March-Movie

సుశాంత్, జాన్యా జోషి, విధి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పింటూ కీ పప్పీ.తెలుగులో కిస్ కిస్ కిస్సిక్ అనే పేరుతో వినయ్ 21న విడుదల కానుంది.ఇందులో హీరో ముద్దు పెట్టిన అమ్మాయిలందరికీ వేరే అబ్బాయిలతో పెళ్లి అవుతుంది.

అయితే తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది అన్న అంశాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.అలాగే కొత్త సినిమాలకు తోడు రీ రిలీజ్ ట్రెండ్‌ లో భాగంగా ఈ నెల 21న రెండు సినిమాలు రాబోతున్నాయి.

అవే నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం.ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సలార్‌: సీజ్‌ఫైర్‌.ఇది ఈ సినిమాలో కేవలం కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల కాబోతున్నాయి.

ఓటీటీలో సందడి చేయబోయే సినిమాల విషయానికి వస్తే.

జితేందర్ రెడ్డి ( Jitender Reddy )అనే సినిమా మార్చి 20 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.అలాగే ఆహాలో బ్రహ్మ ఆనందం అనే సినిమా మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మూవీ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ అనే ఒక వెబ్ సిరీస్ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.బెట్‌ యువర్‌ లైఫ్‌ అనే వెబ్‌సిరీస్ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.అలాగే లిటిల్‌ సైబీరియా అనే మూవీ మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 అనే వెబ్‌సిరీస్‌ మార్చి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube