టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన విజయశాంతి (vijayashanti )సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు.ఈరోజు అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son of Vyjayanthi)మూవీ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కళ్యాణ్ రామ్ (Kalyan Ram)ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ కు ఏకంగా 3.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఈ సినిమా అర్జున్ విశ్వనాథ్ అనే పాత్రలో కళ్యణ్ రామ్ కనిపించనున్నారు.
ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో విజయశాంతి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా రిలీజై హిట్ గా నిలిస్తే తిరుపతి కొండ ఎక్కుతానని అప్పటివరకు తాను నాన్ వెజ్ తిననని విజయశాంతి కామెంట్లు చేశారు.

విజయశాంతి చేసిన ఈ కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఒక సినిమా హిట్ కావడం కోసం ఇంతలా కృషి చేయాలని విజయశాంతి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయశాంతికి ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉంది.ఈ ఈవెంట్ లో బాలయ్య విజయశాంతి (Balayya Vijayashanti)కాంబో గురించి కళ్యాణ్ రామ్ ప్రస్తావించడంతో జై బాలయ్య నినాదం మారుమ్రోగింది.అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు విజయశాంతి ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడం గమనార్హం.







