ఇటీవల కాలంలో సినిమాలకు సీక్వెల్స్ అన్నది కామన్ అయిపోయింది.చిన్న చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా (Pan India)సినిమాల వరకు ప్రతి ఒక సినిమాకు సీక్వెల్స్ ని పాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
అలా ఈ మధ్యకాలంలో చాలా వరకు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమాకు (court movie)కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కోర్టు సినిమాలో హీరో నాని(Nani) నిర్మించిన విషయం తెలిసిందే.రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు.
ఇటీవల విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ వీకెండ్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో కోర్ట్ మూవీను ఫ్రాంఛైజీగా మార్చడంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… కోర్టు సినిమా బాక్స్ ఆఫీస్ ఫ్లో చూస్తుంటే ఈ సినిమాకు సీక్వెల్ తీయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది అని అన్నారు.
కోర్టు ఇప్పుడు చిన్న సినిమానే కానీ సీక్వెల్ అనౌన్స్ చేస్తే మాత్రం అది పాన్ ఇండియా సినిమా అయిపోతుంది.

పెద్ద రేంజ్ కు ఈ సినిమా చేరుకుంటుంది అని తెలిపారు నాని.కోర్ట్ సినిమాను(Court movie) కూడా హిట్ తరహా లోనే యూనివర్స్ గా మారిస్తే బాగానే ఉంటుందని, ఈ రెండు యూనివర్శ్‌ల క్రాస్ ఓవర్ గా కూడా ప్లాన్ చేయవచ్చని, దీనిని తన మైండ్ లో పెట్టుకుంటాను అని అన్నారు హీరో నాని.మరి నిజంగానే నాని ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కిస్తారా, ఈ ఆలోచన కరెక్టేనా అన్నది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.