కేవలం ఈ రెండిటితో నల్లటి వలయాలను వారం రోజుల్లో తరిమికొట్టండి!

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Under Eye Dark Circles ) ఏర్పడడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అధికంగా మొబైల్.

 Get Rid Of Dark Circles With Just These Two Ingredients!, Dark Circles, Lemon Pe-TeluguStop.com

టీవీలను చూడటం, పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఇవి ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

ఈ క్రమంలోనే నల్లటి వలయాలను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతో నల్లటి వలయాలను కేవలం వారం రోజుల్లోనే తరిమికొట్టొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు నిమ్మ పండ్లు( Lemons ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి వాటికి ఉన్న తొక్కను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో నిమ్మ తొక్కలు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన నిమ్మ తొక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్( Potato Juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని పడుకోవాలి.

ఉదయాన్నే చ‌ల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే న‌ల్లటి వలయాలు చాలా వేగంగా మరియు సులభంగా మాయం అవుతాయి.కళ్ళ చుట్టూ చర్మం మళ్లీ మామూలుగా మారుతుంది.

కాబట్టి ఎవరైతే నల్లటి వలయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన‌ రెమెడీని పాటించండి.పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే నల్లటి వలయాలను నివారించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube