హెయిర్ ఫాల్, వైట్ హెయిర్.. రెండిటిని కంట్రోల్ చేసే ఎఫెక్టివ్‌ రెమెడీ ఇదే!

హెయిర్ ఫాల్, వైట్ హెయిర్.ఎక్కువ శాతం మందిని వేధించే సమస్యల్లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.

 This Is An Effective Remedy To Control Hair Fall And White Hair! Hair Fall, Whit-TeluguStop.com

వీటిని కంట్రోల్ చేసుకునేందుకు పడే పాటలు అన్నీ ఇన్నీ కావు.కానీ ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్‌ రెమెడీని(Effective remedy) పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.అదే సమయంలో తెల్ల జుట్టుకు(white hair) సైతం దూరంగా ఉండవచ్చు.

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి.? అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్(Henna powder) ను వేసుకోవాలి.అలాగే సరిపడా వాటర్ వేసి స్మూత్ పేస్టులా మిక్స్ చేసుకుని కనీసం ప‌ది గంటల పాటు అయినా వదిలేయాలి.

ఆ తర్వాత ఒక అరటి పండును తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఈ అరటిపండు స్లైసెస్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు హెన్నా మిశ్రమంలో అరటి పండు పేస్ట్(Banana) ను వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.ఆపై షవర్ క్యాప్ ధ‌రించి రెండు గంటల పాటు వదిలేయాలి.అనంతరం మైల్డ్‌ షాంపూతో(mild shampoo) శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో కేవలం ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే చాలు జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.

అదే సమయంలో జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.ఒకవేళ తెల్ల జుట్టు ఉన్న సరే క్రమంగా బ్లాక్ అవుతుంది.పైగా జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ (Hair pack)ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ మరియు వైట్ హెయిర్ సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ ఎఫెక్టివ్‌ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube