కవితపై ఈడీ విచారణ మొదలైనప్పుడు నుంచి తెలంగాణ ప్రభుత్వం(Telangana) ఒక స్థాయిలో ప్రతిస్పందిస్తుంది.మంత్రులు స్థాయి వ్యక్తులు ఆమె కూడా ఉండి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సమాలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఏడుగురు మంత్రులు ఆమె తో పాటు డిల్లీ కి వెళ్ళి ఆమెకు దక్కాల్సిన అన్ని రకాల మద్దతును అందిస్తున్నారు.అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చెరవేస్తూ తదుపరి కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అదే రకమైన విచారణ ని ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy)పరిస్థితి మాత్రం భిన్నంగా కనబడుతుంది.
అవ్వడానికి ముఖ్యమంత్రికి తమ్ముడు వరుసైన స్వంత తమ్ముడు లాగానే ముఖ్యమంత్రి భావిస్తుంటారు.కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సైతం ఏ రకమైన మద్దతు అందించడానికి సిద్ధంగా లేనట్లుగా తెలుస్తుంది.
సిబిఐ తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పేడుతుందని తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన సోదరికి ముందే తెలియజేస్తూ తనకు వ్యతిరేకంగా చర్యలు ఉండేలా పావులు కదుపుతుందని అవినాష్ రెడ్డి వాపోయారు.

తన విచారణ సందర్భంలో ఒకే ఒక్క లాప్టాప్ పెడుతున్నారని ,అది అసలు రికార్డింగ్ అవుతుందా లేదా అని కూడా స్పష్టత ఇవ్వడం లేదని తనకు విచారణ జరుగుతున్న విధానంపై చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన చాలా ఆరోపణలు చేశారు.ఈ విషయం పై ఆయన హై కోర్టు లో కేసు కూడా వేశారు .అయినప్పటికీ ఆయనకు మద్దతుగా ఉండేలా ప్రభుత్వం తరఫున ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా లేవు.కేంద్రంతో సఖ్యత నెరుపుతూ ఉండే జగన్ కు ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన అందుకు సుముఖంగా లేనట్లుగా కనపడుతుంది.కవిత విషయంలో విచారణ చేస్తున్నది ఈడి అయిన కూడా , మోడీ(Modi) దగ్గరుండి ఇదంతా చేస్తున్నట్లుగా ప్రచారం చేయడంలో బారాస పార్టీ విజయం సాధించింది.
మోడీ వర్సెస్ కేసీఆర్ నడుస్తున్నట్లుగా ప్రజల్లో సానుభూతి కూడా సంపాదించుకోగలిగింది.మరి ఒక స్థాయి వరకు అవినాష్ రెడ్డికి మద్దతు ఇస్తూ వచ్చిన జగన్(jagan) ఒకసారి విచారణ హైదరాబాద్కు మారిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిస్థాయిలో వదిలేసినట్లుగా అర్థమవుతుంది.
దీనికి కారణం మారిన సమీకరణాల ? లేక ఇతర రాష్ట్రంలోని విషయాన్ని మనం ఏం చేయలేం కాబట్టి వదిలేశారా? లేక తమకున్న అనేక ఇబ్బందుల్లో దీనిని కూడా పట్టించుకోవడం ఎందుకు అనుకున్నారు ఆయనకే తెలియాలి.







