పాదాలు పగిలి నొప్పి పుడుతున్నాయా? అయితే వెంటనే ఇలా చేయండి!

పాదాల పగుళ్లు.( Cracked Feet ) స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

 Wonderful Remedy For Get Rid Of Cracked Feet Details! Home Remedy, Latest News,-TeluguStop.com

పాదాల పగుళ్లు ఏర్పడడానికి కారణాలు అనేకం.ఊబ‌కాయం, పాదాల‌ను స‌రిగ్గా క్లీన్ చేయకపోవడం, శ‌రీరంలో అధిక వేడి, గంటల తరబడి నిలబడి ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల పాదాల పగుళ్ల సమస్య ఏర్పడుతుంది.

అయితే కార‌ణం ఏదైనా పాదాలు పగలడం వల్ల తీవ్రమైన నొప్పికి అసౌకర్యానికి గురవుతుంటారు.

ఒక్కోసారి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

అడుగు తీసి అడుగు వేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించండి.

రెమెడీ పాదాల పగుళ్లను చాలా వేగంగా మరియు సులభంగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ ను( Vaseline ) వేసుకోవాలి.అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆవ నూనె, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ప్ర‌తిరోజు ఈ వండర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే వాసెలిన్, అలోవెరా జెల్, ఆవనూనె మరియు నిమ్మరసంలో ఉండే పలు సుగుణాలు పాదాల పగుళ్లను చాలా వేగంగా మాయం చేస్తాయి.అదే సమయంలో పాదాలను సున్నితంగా మరియు కోమలంగా మారుస్తాయి.కాబట్టి ఎవరైతే పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో తప్పకుండా వారు ఈ హోమ్ మేడ్ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube