సాధారణంగా ఎవరైనా డైరెక్టర్ ఒక యాక్టర్‌కి ఒక మాట ఇస్తే కంపల్సరీగా దాన్ని నిలబెట్టుకోవాలి.లేకపోతే మోసం చేసినట్లే అవుతుంది కొంతమంది డైరెక్టర్లు నిజంగానే కొంతమంది యాక్టర్లను మోసం చేశారు వారెవరో తెలుసుకుందాం.
• అడివి శేష్ – శ్రీను వైట్ల
మల్టీ టాలెంటెడ్ పర్సన్ అడివి శేష్( Adivi Sesh ) టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.అయితే కెరీర్ స్టార్టింగ్‌లో అడవి శేష్‌ను శ్రీను వైట్ల( Srinu Vaitla ) మోసం చేశాడు.
ఆయన తన రొమాంటిక్ కామెడీ మూవీ సొంతం (2002)లో హీరో ఛాన్స్ ఇస్తానని అడివి శేష్‌కు చెప్పి ఆశపెట్టాడు.ఆ తర్వాత హీరో రోల్ ఆర్యన్ రాజేష్‌కి ఇచ్చేశాడు.
ఇందులో అడివి శేష్ హీరోయిన్ నమితకి కాబోయే భర్తగా రెండు సీన్లలో మాత్రమే నటించాడు.హీరో అని తీసుకొని, రెండు రోజులు షూటింగ్ చేశాక, ఇక నీతో పని అయిపోయిందని శ్రీను వైట్ల చెప్పడం షాకింగ్‌గా అనిపించిందని అడివి శేషు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
• పృథ్వీరాజ్ – కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) డైరెక్ట్ చేసిన “దేవుళ్లు (2000)” సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.ఈ మూవీలోని “అందరి బంధువయ్య” పాట సూపర్‌హిట్ అయింది.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట అందరి ఇళ్లలో ఒక సుప్రభాతం లాగా వినిపించేది.ఇందులో శ్రీకాంత్ రాముడు వేషంలో కనిపిస్తాడు.నిజానికి ఈ వేషం పృథ్వీరాజ్‌కు( Prudhviraj ) ఇస్తానని డైరెక్టర్ చెప్పాడట.కానీ ఆ తర్వాత వేషం ఇవ్వకుండా మోసం చేశాడు.
• వేణు తొట్టెంపూడి – బోయపాటి శ్రీను
దమ్ము (2012) మూవీలో తారక్ బావగా వేణు తొట్టెంపూడి( Venu Tottempudi ) నటించాడు.అయితే ఆయన పాత్ర చాలా వీక్‌గా, ఆటలో అరటిపండు లాగా ఉంటుంది.ఆయన చేసిన పాత్ర చనిపోతుంది కూడా.అయితే సినిమా స్టోరీ గానీ, తన రోల్ ఎలా ఉంటుందో గానీ చెప్పకుండా బోయపాటి శ్రీను వేణుని దారుణంగా మోసం చేశాడు.
వేణు ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ అలాంటి చెత్త క్యారెక్టర్ తన కెరీర్‌లో ఎప్పుడూ చేయలేదని, బోయపాటి శ్రీను స్టోరీ చెప్పకుండా ఆ పాత్ర తన చేత చేయించాడని అన్నాడు.
• ప్రియమణి – అట్లీ
యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం “జవాన్” సినిమాలో ప్రియమణి( Priyamani ) లక్ష్మిగా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా వల్ల ఆమెకు చాలా మంచి గుర్తింపు కూడా వచ్చింది.అయితే అట్లీ ( Atlee ) ఈ రోల్‌లో ఆమెను నటింప చేయడానికి ఒక అబద్ధమాడాడు.
ఈ మూవీలో విజయ్ దళపతి కూడా ఒక క్యామియో రోల్ చేస్తున్నాడని చెప్పి ఆమెను ఒప్పించాడు కానీ మోసం చేశాడని ప్రియమణికి తర్వాత తెలిసింది.