ప్రముఖ తెలుగు దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు.ఇతనికి సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువ.
ఆయన సినిమాలు చూస్తే మనం కడుపుబ్బా నవ్వకుండా ఉండలేము.అనిల్ పటాస్, ఎఫ్2, రాజా ది గ్రేట్ వంటి కామెడీ సినిమాలతో మాత్రమే కాదు భగవంత కేసరి లాంటి యాక్షన్ మూవీలతో కూడా సక్సెస్‌లు అందుకున్నాడు.
అనిల్ 2005లో విజ్ఞాన్ కాలేజీలో బి.టెక్ పూర్తి చేసిన తర్వాత తన అంకుల్ పి.ఎ.అరుణ్ ప్రసాద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.తర్వాత సినిమాలకు డైలాగులు, స్క్రీన్ ప్లే రాసి తన టాలెంట్ ప్రదర్శించాడు.
అయితే చదువుకునే రోజుల్లో అనిల్ జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయని అంటారు.అప్పుడప్పుడు వీటిని ఇంటర్వ్యూలలో అతనే బయట పెడుతుంటాడు.రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు చిన్నప్పుడు ఏ హీరోయిన్ అంటే ఇష్టమో తెలియజేశాడు.
అందులో “హీరోయిన్ నగ్మా( Heroine Nagma ) అంటే మీకు తెగ పిచ్చి అంట కదా?” అని ఒక ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ చేశాడు.ఆ ప్రశ్న అడగగానే అనిల్ రావిపూడి బాగా నవ్వుకున్నాడు.
ఆ తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ “నా చిన్నప్పుడు.బహుశా టెన్త్ చదువుతున్న సమయంలో అనుకుంటా.ఆ ఏజ్ లో పెద్దగా మెచ్యూరిటీ కూడా ఉండదు.స్కూల్ కి వెళ్తూ నగ్మా సినిమా పోస్టర్లను చూస్తూ ఉండేవాణ్ణి.వెనుక బ్యాగు తగిలించుకొని గోడలకు అతికించిన పోస్టర్లలో ఆమె అందాన్ని చూస్తూ ఈవిడ భలేగా ఉంది అనుకుంటూ ఉండేవాన్ని.ఆమె బుగ్గలు, ఫేస్ కట్ చూస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయినా సందర్భాలు ఉన్నాయి.బహుశా అవి అల్లరి అల్లుడు (1993)( Allari Alludu ) సినిమా పోస్టర్లు అనుకుంటా.” అని అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్ చేశాడు.
ఈ ఇంటర్వ్యూ క్లిప్‌కి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూశాక అనిల్ లో ఇలాంటి నాటీ యాంగిల్ కూడా ఉందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ డైరెక్టర్ 1982లో జన్మించాడు.అల్లరి అల్లుడు సినిమా 1993లో వచ్చింది.
అంటే దాదాపు 11-12 ఏళ్ల సమయంలోనే ఈ హీరోయిన్ నగ్మాపై పిచ్చిగా ప్రేమ పెంచేసుకున్నాడు.