అందానికి మందారం.. ఇలా వాడితే మచ్చలేని మెరిసే మృదువైన చర్మం మీ సొంతం!

పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో కనిపించే చెట్టు మందారం( Hibiscus ).మందార పువ్వులను పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

 How To Use Hibiscus For Spotless Smooth Shiny Skin!, Hibiscus Flowers, Hibiscus,-TeluguStop.com

ఇంకొందరు జుట్టు సంరక్షణకు వాడుతుంటారు.అయితే అందానికి కూడా మందారం అండగా నిలుస్తుంది.

ముఖ్యంగా మందార పువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మచ్చలేని మెరిసే మృదువైన చర్మం( Spotless Skin ) మీ సొంతమవుతుంది.సహజంగానే మీరు అందంగా మెరిసిపోతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మందార పువ్వులతో అందాన్ని ఎలా పెంచుకొవచ్చో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Hibiscus, Hibiscus Oil, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti

ముందుగా పది మందార పువ్వులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పెటల్స్ ను సపరేట్ చేసుకోవాలి.ఆపై తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు బాదం నూనె వేసుకోవాలి.

అలాగే మందారం పువ్వు రేకులను( Hibiscus Petals ) కూడా వేసి స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

అనంతరం ఆయిల్ ను చల్లార‌పెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన తర్వాత స్టైనర్ సహాయంతో ఆయిల్ లో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ మందారం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు లేదా ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న మందారం ఆయిల్( Hibiscus Oil ) ను ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకొని కనీసం పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Hibiscus, Hibiscus Oil, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti

ప్రతిరోజు గనక ఇలా చేస్తే మందారం ఆయిల్ లో ఉండే పలు సుగుణాలు మీ చర్మ ఛాయను పెంచుతాయి.ముడతలను మాయం చేస్తాయి.మచ్చలను నివారిస్తాయి.చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.మొటిమల‌కు( Pimples ) అడ్డుక‌ట్ట వేస్తాయి.అలాగే ఈ మందారం అయిల్ ను వాడ‌టం వ‌ల్ల‌ చర్మం కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ టైట్ అవుతుంది.ఫైనల్ గా మచ్చలేని మెరిసే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube