తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందిన దగ్గర నుంచి కేసీఆర్ దాదాపుగా జనాల్లోకి రావడమే మానేశారు. అప్పుడప్పుడు వచ్చినా, పూర్తిస్థాయిలో జనాల్లో ఉండడం లేదు.
పార్టీ కార్యక్రమాలన్నీ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావులే( KTR and Harish Rao ) చక్కబెడుతున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం, ఆమెకు ఇంకా బెయిల్ లభించకపోవడం, తదితర కారణాలతో కేసీఆర్ అంత చురుగ్గా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు.
చాలా రోజులుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నా కెసిఆర్ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కొంతమంది అసంతృప్తి నేతలు, పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కేసీఆర్ భేటీ అవుతున్నారు.
![Telugu Brs, Hareesh Rao, Kcr Raitu Yatra, Revanth Reddy, Telangana-Politics Telugu Brs, Hareesh Rao, Kcr Raitu Yatra, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/KCR-in-the-crowd-with-Raitu-Yatrac.jpg)
కెసిఆర్ పూర్తిస్థాయిలో జనాల్లోకి వచ్చి కాంగ్రెస్ పై పోరాటం చేస్తే గాని పార్టీలో పరిస్థితి చక్కబడదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, కెసిఆర్ ( KCR )త్వరలోనే జనాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు .ఈ మేరకు రైతు యాత్ర చేపట్టాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని , రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ,కొంతకాలంగా బీ ఆర్ ఎస్ విమర్శలు చేస్తోంది .కేటీఆర్, హరీష్ రావులు కూడా కాంగ్రెస్ నేతలకు సవాళ్లు విసురుతున్నారు.కానీ కేసిఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
![Telugu Brs, Hareesh Rao, Kcr Raitu Yatra, Revanth Reddy, Telangana-Politics Telugu Brs, Hareesh Rao, Kcr Raitu Yatra, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/KCR-in-the-crowd-with-Raitu-Yatrad.jpg)
ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కడా బయటకు రాలేదు.బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున మాత్రమే అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని మీడియా పాయింట్ లో చెప్పి వెళ్ళిపోయారు.అయితే కేసీఆర్ మళ్లీ జనాల్లోకి ఎప్పుడు వస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో , త్వరలోనే కెసిఆర్ రైతు యాత్ర చేపట్టబోతున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఆలేరులో ప్రకటించారు.
ప్రతి రైతుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఒత్తిడి తెచ్చే విధంగా యాత్ర చేయబోతున్నారని హరీష్ రావు చెప్పారు.అయితే కేసీఆర్ చేపట్టబోయే రైతు యాత్ర తేదీని మాత్రం హరీష్ రావు ప్రకటించలేదు.