నెలన్నర నుంచి తిండి లేదు.. ఏడుపే మిగిలింది.. గాయని ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

అంజూ జోసెఫ్‌( Anju Joseph ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తన సత్తా నిరూపించుకుంది అంజూ.2010లో మలయాళం స్టార్ సింగర్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ఎంతోమందిని మెప్పించింది.అంతేకాకుండా సినిమాలో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా పాటలు పాడడం మొదలుపెట్టింది.ఆ తర్వాత అతి కొద్ది సమయంలోనే కవర్‌ సాంగ్స్‌, స్టేజీ షోలు( Cover songs, stage shows ) చేసే స్థాయికి ఎదిగింది.

 Singer Anju Joseph About Her Past Relationship, Singer Anju Joseph, Relationship-TeluguStop.com

తక్కువ సమయంలోనే భారీగా అభిమానులను సంపాదించుకుంది అంజూ జోసెఫ్.బాహుబలి మూవీలోని ధీవర పాటపై ఈమె చేసిన కవర్‌ సాంగ్‌ అప్పట్లో ఎంతో వైరల్ అయ్యిండో మనందరికే తెలిసిందే.

Telugu Relationship, Anju Joseph, Anjujoseph, Tollywood-Movie

ఇకపోతే ఆమె షో డైరెక్టర్‌ అనూప్‌ జాన్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఐదేళ్లపాటు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట తర్వాత కలిసుండలేక పోయారు.విడాకులు తీసుకున్నారు.ఆ సమయంలో తను పడ్డ మానసిక వేదనను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు అబ్సెసివ్‌ కంపల్సిన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌( Obsessive Compulsive Personality Disorder ).అలాగే ఆందోళన సమస్యలు ఉన్నాయి.వీటికి మందులు కూడా తీసుకుంటున్నాను.

గత రిలేషన్‌షిప్‌ వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను.దాని ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నెలన్నర నుంచి సరిగా నిద్రపోయిందే లేదు.ఎప్పుడూ మెలకువతోనే ఉంటున్నాను.

ఏం ఆలోచించాలో కూడా అర్థమవడం లేదు.

Telugu Relationship, Anju Joseph, Anjujoseph, Tollywood-Movie

నిద్రరాకపోయినా బెడ్‌పై నుంచి లేవబుద్ధి కావట్లేదు.నేను ఎలా ఉన్నా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో షోలు చేశాను.అది నా వృత్తి, పైగా నేను ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటాను కాబట్టి ఫేక్‌ నవ్వుతో కవర్‌ చేసేశాను.

కానీ నా శరీరంలోనూ సమస్యలు వస్తున్నాయి.నేను ఏడ్చిన తర్వాతే షోకి వస్తున్నానని అక్కడున్నవారికీ తెలిసిపోతుంది.

నా భర్తతో బంధం తెగిపోవడానికి ఓసీడీ ఒక్కటే కారణం కాదు.ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.

అయితే బంధం ముక్కలైందని నేనేమీ చింతించట్లేదు.దాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.

అసలు నేనేంటో లోతుగా తెలుసుకుంటున్నాను.ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాను.

అదొక్కటే నాకు మిగిలింది.దీనికి కూడా థెరపీ చేయించుకుంటున్నాను.

జీవితం ముందుకు కదలట్లేదు.అలాగని బలవంతంగా చనిపోనూలేను.

అయినా విడాకులు తీసుకోవడం పెద్ద నేరమేమీ కాదు.విడాకులు తీసుకున్నవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు కదా అని చెప్పుకొచ్చింది సింగర్ అంజూ జోసెఫ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube