ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) కేంద్ర అధికార పార్టీ బిజెపిపై( BJP ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కార్పొరేట్ జలగల రిమోట్ కంట్రోల్ తో ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆమె సంచలన విమర్శలు చేశారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోది,( PM Narendra Modi ) కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ నేపథ్యంలోనే కేంద్రం పై షర్మిల విమర్శలు చేశారు.” నాడు బ్రిటిష్ వారిపై నిస్వార్ధంగా పోరాడి స్వేచ్ఛ , లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి దేశానికి స్వతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈ రోజు మరోసారి ప్రజాదనాన్ని లూటీ చేస్తూ ప్రజల ఆస్తులను విచక్షణ రహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలు, వారి చేతిలోనున్న రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోది సర్కారుపై కాంగ్రెస్ పార్టీ మరొక పోరాటం సాధిస్తుందని షర్మిల విమర్శించారు.

” సెబీ చీఫ్ మాదాబి పూరిపై( Madhabi Puri ) వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా ఆదాని( Adani ) పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ నిమ్మకు నీరు ఎత్తినట్టు మౌనం వహిస్తూ, అటు ఆమెను, ఇటు ఆదానిని కాపాడే కుటీల ప్రయత్నాలను చేస్తున్న మోడీ సర్కార్ దివాలా కోరుతున్నాను నిరసిస్తూ ఇండియా కూటమి నేడు దేశవ్యాప్తంగా ఈడి ఆఫీసుల ఎదుట ధర్నా నిర్వహిస్తోందని షర్మిల అన్నారు.దేశంలోని 10 కోట్ల మంది పెట్టుబడుదారుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తూ , మాదాభి పూరి విషయంలో వెంటనే జెపిసి వేసి సిబిఐ, ఈడి సమగ్ర విచారణకు ఆదేశించాలి అని షర్మిల డిమాండ్ చేశారు.

ప్రభుత్వ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారని కేంద్ర బిజెపి ప్రభుత్వంపై షర్మిల విమర్శించారు.కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడుల కోసమే వాటిని వాడుకుంటున్నారని విమర్శించారు. మోది నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని, ఆదాని లాభాలు మోదీ లాభాలుగా, ఆదాని సంస్థల అభివృద్ధి బిజెపి అభివృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టారని బిజెపి పెద్దలపై షర్మిల విమర్శలు చేశారు.