బ్రిటన్‌లో ఇటీవల లస్సా జ్వరానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి.ఇది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి.
దీనిని లస్సా వైరస్ అని అంటారు.ఈ వైరస్ మొదటి కేసు 1969లో నైజీరియాలోని లాసా నగరంలో నమోదైంది.
అందుకే ఈ వ్యాధికి లాసా అని పేరు పెట్టారు.మొదటగా ఇద్దరు నర్సులు లస్సా జ్వరంతో మరణించారు.
ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి కేసులు నమోదయ్యాయి.లస్సా వైరస్ అంటే ఏమిటి? అది ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.లస్సా జ్వరం అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి.ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది.లస్సా వైరస్ సోకిన ఎలుకల మలం, మూత్రం లేదా అవి తాకిన ఆహార పదార్థాల కారణంగా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుంది.
పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఎలుకలు అధిక సంఖ్యలో ఉంటాయి.అందుకే ఇక్కడ ఇటువంటి కేసులు అధికంగా నమోదయ్యాయి.పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఈ వ్యాధి స్థానిక దశలో ఉంది, దీంతో ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఈ వ్యాధితో జీవించడం నేర్చుకున్నారు.లస్సా వైరస్ సోకిన రోగులలో 80 శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు.
అయితే జ్వరం, అలసట, తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపించినప్పుడు బాధితులు అప్రమత్తం అవుతారు.ఇంతేకాకుండా.
వాంతులు, ముఖంలో వాపు, రక్తస్రావం, ఛాతీ, వెన్ను మరియు కడుపు నొప్పి ఈ ఇన్ఫెక్షన్‌లోని తీవ్రమైన లక్షణాలు.

వైరస్ సోకిన తర్వాత అది తన ప్రభావాన్ని చూపడానికి 2 నుండి 21 రోజులు పట్టవచ్చు.WHO నివేదిక ప్రకారం, లస్సా వైరస్ సంక్రమణ కారణంగా మరణించే ప్రమాదం ఒక శాతం వరకు ఉంటుంది.అయితే, గర్భిణీ స్త్రీలు అత్యంత ప్రమాదకర జోన్‌లో ఉన్నారు.80 శాతం ఇన్ఫెక్షన్ కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు.అందువల్ల వైరస్‌ను గుర్తించడం సాధ్యం కాదు.
ప్రారంభ దశలో చికిత్స చేయకపోతే, రోగిని ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుంది.లస్సా వైరస్ సోకిన ప్రతి ఐదుగురు రోగులలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చు.
ఈ వైరస్ సోకినపుడు బాధితుని కాలేయం, ప్లీహము, మూత్రపిండాలపై దాడి చేస్తుంది.వ్యాధి లక్షణాలు కనిపించిన 2 వారాల తర్వాత బాధితుడు మృతి చెందేందుకు అవకాశాలుంటాయి.