వయసు పైబడే కొద్ది ముఖంపై ముడతలు రావడం సర్వ సాధారణం.కానీ, ఇటీవల రోజుల్లో చిన్న వయసు వారు సైతం ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లు, ఎండల ప్రభావం, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత, మద్యపానం, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల ముఖంపై ముడతలు పడుతూ ఉంటాయి.దాంతో వీటిని తొలగించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.
చర్మంపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్యాక్‌ను ట్రై చేస్తే గనుక చాలా సులభంగా మరియు వేగంగా ముఖంపై ఉన్న ముడతలను పోగొట్టు కోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కలోంజి సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పౌడర్‌లో ఒక స్పూన్ తేనె, మూడు స్పూన్ల బాదం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పది హేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆర బెట్టుకోవాలి.
అనంతరం కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని మీ స్కిన్‌కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
ఈ ప్యాక్‌ను రెగ్యులర్‌గా కొద్ది రోజుల పాటు వేసుకుంటే ముఖంపై ఎలాంటి ముడతలు ఉన్నా క్రమంగా తగ్గు ముఖం పడతాయి.అలాగే ఈ ప్యాక్ వల్ల స్కిన్ టోన్ మెరుగ్గా మారుతుంది.డార్క్ స్పాట్స్ ఉంటే మటు మాయం అవుతాయి.
మరియు చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోకుండా ఉంటాయి.