తెలుగు హీరోయిన్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావు.ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది తెలుగు హీరోయిన్ లు చెప్పారు.
ఇక ఇప్పుడు మరో హీరోయిన్ విషయంలో కూడా ఇది నిజం అవుతుంది అనేది తెలుస్తుంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈషా రెబ్బ.
ఈ అమ్మడు అచ్చ తెలుగు హీరోయిన్.పాపం అదే ఈమెకు అయిపోయిందా అంటే అవును అని అంటుంది ఈ ముద్దుగుమ్మ.
మొదట్లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ సొగసరి.అందాల ఆరబోతకు కొన్ని లిమిటేషన్స్ కూడా పెట్టుకుంది.
అదే ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.
అవకాశాలు వచ్చినా అడపాదడపా సినిమాలకు సంబంధించినవి తప్ప క్రేజీ ఆఫర్స్ మాత్రం దక్కించు కోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలి కాలంలో అసలు వెండితెరపైనే కనుమరుగయ్యింది అని చెప్పాలి.అయితే ఇక ఇప్పుడు అవకాశాల కోసం అందాల ఆరబోతకు పెట్టుకున్న లిమిటేషన్స్ అన్నింటిని పక్కకు పెట్టేసి హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ చూసిన తర్వాత వామ్మో ఈషా రెబ్బ అందాల ఆరబోతతో అబ్బా అనిపిస్తుంది ఏంటి అని కొంత మంది అనుకుంటుంటే.హీరోయిన్ ఏంటి ఈ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తుంది అని అనుకుంటున్నారు నెటిజన్లు.
ఇటీవలి కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ప్రతి ఫోటో కూడా తెగ వైరల్ గా మారిపోతుంది.గతంలో ఇక ఇలాంటి ఒక ఫోటోని షేర్ చేస్తే తన ఫ్రెండ్ అయినా రాజశేఖర్ కూతురు శివాని ఇంత అందంగా ఎలా మారిపోయావు అబ్బా అన్నం తింటున్నావా అందం తింటున్నావా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది కూడా.
కాగా మొన్నటి వరకు కనీసం అందాల ఆరబోతకు కూడా ఒప్పుకొని ఈశా రెబ్బ ఇప్పుడు బికినీలు వేసేందుకు సై అంటుంది అన్నది తెలుస్తుంది.ఇక ఇలా ఇటీవల కాలంలో ఈషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు ఈ హీరోయిన్ ఏంటి ఇంతలా దిగజారిపోయింది అని అనుకుంటున్నారట.