మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నేడు పుట్టినరోజు ( Birthday ) వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు సినిమా సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.ఆగస్టు 22వ తేదీ ఈయన పుట్టినరోజు కావడంతో అభిమానులు కూడా పెద్ద పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.ఇక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి కూడా అప్డేట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
చిరంజీవి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇలా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈయన ఒక్క ముక్కలో చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పడంతో మెగా అభిమానులు ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
నేడు అల్లు అర్జున్( Allu Arjun ) ఈ స్థాయిలో ఉన్నారు అంటే చిరంజీవి కృషి ఎంతగానో ఉంది అలాంటిది ఆయన పుట్టిన రోజు జరుపుకుంటూ ఉంటే ఈయన కేవలం మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే అవర్ చిరంజీవి గారు అంటూ పోస్ట్ చేయడం ఏమాత్రం సబబు కాదని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.అయితే బన్నీ చేసిన ఈ పోస్ట్ చూస్తే కనుక ఏదో ఫార్మాలిటీకి చేయాలంటే చేయాలి అన్న ఉద్దేశంతోనే చిరంజీవికి విష్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.అయితే మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.