టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న మహేష్ ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఒరిస్సాలో షూటింగ్ జరుపుకుంటున్నారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మహేష్ బాబు నటించిన ఒక సినిమా స్టార్ మా లో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అవ్వటం జరిగింది.అయితే ఈ సినిమాని ఈ స్థాయిలో ప్రసారం చేసినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి 1500 సార్లు టెలికాస్ట్ అయినటువంటి మహేష్ బాబు సినిమా ఏది అనే విషయానికి వస్తే.

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఖలేజా ,అతడు, గుంటూరు కారం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్రిష(Trisha) మహేష్ బాబు హీరో హీరోయిన్లగా నటించిన అతడు(Athadu) సినిమాను ఇప్పటికీ టెలివిజన్ టెలికాస్ట్ చేసిన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు.అయితే స్టార్ మా ఈ సినిమాని ఇప్పటికే 1500 సార్లు ప్రసారం చేసినప్పటికీ మంచి రేటింగ్ కైవసం చేసుకుందని తెలుస్తుంది.
ఇప్పటివరకు బుల్లితెరపై 1000 సార్లకు మించి ఏ సినిమాలు టెలికాస్ట్ కాలేదు కానీ మహేష్ బాబు అతడు సినిమా 1500 సార్లు టెలికాస్ట్ కావడం అంటే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతుంది.ఈ చిత్రానికి నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చాయి.
తెలుగులో 2005లో వచ్చిన అన్ని చిత్రాల్లో కంటే ఈ చిత్రమే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నిలిచింది.ఇక ఈ చిత్రం హిందీ బెంగాలీ లోను రీమేక్ అయింది.