టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Nandamuri hero Kalyan Ram ), ఒకప్పటి హీరోయిన్ నటి విజయశాంతి కలిసి నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి.( Arjun son of Vyjayanthi ).
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.తండ్రీ కొడుకులు పలు విషయాల్లో గొడవ పడడం చివరకు ఒక్కటవడం చాలా చిత్రాల్లో చూశాము.

కానీ మా సినిమాలో ఎంతో ప్రేమగా ఉండే తల్లీ కొడుకులు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే కీలకం.దర్శకుడు ప్రదీప్( Director Pradeep ) ఈ కథ చెప్పిన సమయంలోనే తల్లి పాత్రలో విజయశాంతి మేడమ్ నే ఊహించుకున్నాను.నేను ఆమెను విజయశాంతి గారు అని అనను.మనస్ఫూర్తిగా అమ్మ అనే పిలుస్తాను.ఈ సినిమాతో అంతగా దగ్గరయ్యాము.ఈ చిత్రానికి స్ఫూర్తి కర్తవ్యం.
ఆ సినిమాలోని వైజయంతికి అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆసక్తికర పాయింట్ తో ఈ కథను డెవలప్ చేశాము.ఆమె ఈ సినిమా ప్రధాన బలం.

పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారు అని తెలిపారు కళ్యాణ్ రామ్.ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సినిమా నుంచి విజయశాంతి అలాగే కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఫోటోలు విడుదల చేసిన విషయం తెలిసిందే.వీటికి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నారు.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.