సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun directed by Sukumar)హీరోగా నటించిన చిత్రం పుష్ప(Pushpa).ఈ సినిమా ఇప్పటికే రెండు పార్ట్ లుగా విడుదల అయి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.ఇకపోతే గత ఏడాది డిసెంబర్లో విడుదల అయిన పుష్ప 2(Pushpa) సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
పుష్ప 3 ఉంటుందని ఇప్పటికీ డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ దానికి చాలా సమయం పడుతుంది అని తెలుస్తోంది.
తాజాగా ఇదే విషయం గురించి రవిశంకర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియాతో మాట్లాడారు.

2028లో పుష్ప 3 (pushpa 3)సినిమా వస్తుంది అని మైత్రి నిర్మాణ సంస్థ భాగస్వామి అయినా రవిశంకర్(ravi shankar) వెల్లడించారు.ఆయన మాట్లాడిన మాటల విషయానికొస్తే.ప్రస్తుతం అల్లు ఏ సినిమా మొదలుపెట్టలేదు.అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ విషయంపై ఇంకా సరైన స్పష్టత లేదు.
ఒకవేళ ఆ సినిమా ఉన్నా కూడా అన్ని క్లియర్ చేసుకొని ఆ సినిమా విడుదల కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.అంటే అట్లీ బన్నీ సినిమా 2026 లోనే విడుదల అవుతుందని చెప్పాలి.
అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేసే భారీ మైథలాజికల్ సినిమా మేకింగ్ కు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

అంటే 2028 లో ఆ సినిమా రావడానికి అవకాశం వుంటుంది.ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ఫాస్ట్గా చేస్తే సినిమా 2027 చివరకు వస్తుంది.అప్పుడు మొదలు పెట్టాలి.
పుష్ప 3 సినిమా.సుకుమార్ మేకింగ్(Pushpa 3 movie.
Sukumar making) స్టయిల్ తెలిసిందే.ఎలా లేదన్నా రెండేళ్ల పై మాటే.
అంటే 2029 నుంచి 2030 రావాలి పుష్ప 3 ని తెర మీద చూడాలి.కానీ అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు.
అంత నెమ్మదిగా సినిమాలు చేసే ఆలోచనలో లేరు.త్రివిక్రమ్ సినిమానే టైమ్ ఎక్కువ పడుతుందని, ఒక సినిమా వెనక్కు నెట్టారు.
ముందుగా ఒక సినిమాను త్వరగా అందించాలని డిసైడ్ అయ్యారు.అందువల్ల త్రివిక్రమ్ సినిమా ముందు కానీ వెనుక కానీ సరైన డైరక్టర్, సరైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తే అటు వెళ్లకుండా వుండలేరు.
అలా అని పుష్ప సిరీస్ ను కూడా వదిలేయరు.కానీ అది ఎప్పుడు వచ్చినా, దాని క్రేజ్ దానికి వుంటుంది కనుక మెల్లగా చేస్తారు.
ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని పుష్ప 3 సినిమా విడుదల కావాలి.లేదంటే ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి పుష్పత్రి సినిమా చేయాలి.
అది అయ్యే పని కాదు కాబట్టి ఎలా చూసినా కూడా పుష్ప 3 సినిమా విడుదల కావడానికి 2030 కాలం వరకు సమయం పడుతుందని చెప్పాలి.