ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ హీరోలు, ఇతర భాషల స్టార్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టి వరుస విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.దుల్కర్ సల్మాన్,( Dulquer Salmaan ) ధనుష్( Dhanush ) ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.
అయితే టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన మరో స్టార్ హీరో జాబితాలో ప్రదీప్ రంగనాథన్( Pradeep Ranganathan ) పేరు వినిపిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుతం ప్రదీప్ తో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులో భారీ స్థాయిలోనే మార్కెట్ ఉండగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్( Director Kalyan Shankar ) ప్రదీప్ రంగనాథన్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
మ్యాడ్ డైరెక్టర్( Mad Movie Director ) ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వాస్తవానికి రవితేజ కల్యాణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందని సమాచారం అందుతోంది.ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.ప్రదీప్ రంగనాథన్ కు వరుస విజయాల వల్ల పారితోషికం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రదీప్ రంగనాథన్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.ప్రదీప్ రంగనాథన్ చూడటానికి ధనుష్ లా ఉండటం ఈ హీరోకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.ప్రదీప్ రంగనాథన్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.హీరో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.