ఎండల వల్ల చేతులు నల్లగా మారాయా? అయితే ఒక్క వాష్ లోనే ఇలా తెల్లగా మార్చుకోండి!

వేసవికాలం రానే వచ్చింది.ఎండలు మండిపోతున్నాయి.

 How To Get Rid Of Hands Darkness In One Wash? Hands Darkness, Sun Tan, Summer, S-TeluguStop.com

ఈ ఎండల్లో బయట తిరగడం అంటే ప్రతి ఒక్కరికి గగనమే.అయితే వేసవి వేడి కారణంగా ఆరోగ్యమే కాదు చర్మ సౌందర్యం( Skin beauty ) సైతం దెబ్బతింటుంది.

ముఖ్యంగా ఎండల కారణంగా చర్మం నల్లగా మారిపోతుంటుంది.ఈ క్రమంలోనే బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని కచ్చితంగా కవర్ చేసుకుంటూ ఉంటారు.

కానీ చేతుల‌ను మాత్రం మరిచిపోతుంటారు.దీంతో చేతులు ట్యాన్ అయిపోతుంటాయి.

ఎండల వల్ల నల్లగా మారిన చేతులను ఒక్క వాష్ లోనే తెల్లగా మార్చుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే ట్యాన్ అయిన చేతులు మళ్లీ తెల్లగా మారతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్‌( Coffee powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి.

Telugu Tips, Darkness, Remedy, Skin Care, Skin Care Tips, Sun Tan-Telugu Health

చివ‌రిగా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), సరిపడా టమాటా జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకొని కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం నిమ్మ చెక్కను తీసుకుని చేతులపై స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

Telugu Tips, Darkness, Remedy, Skin Care, Skin Care Tips, Sun Tan-Telugu Health

కనీసం పది నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చేతుల‌ను క్లీన్ చేసుకోవాలి.అనంతరం తడి లేకుండా చేతుల‌ను కాటన్ క్లాత్ తో తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ రెమెడీని పాటిస్తే ఒక్క వాష్ లోనే ఎంతో మంచి రిజల్ట్ ను మీరు గమనిస్తారు.

ఎండల కారణంగా నల్లగా మారిన చేతులను తెల్లగా మార్చడానికి ఈ హోమ్ రెమెడీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.ఈ రెమెడీని నల్లగా మారిన పాదాలకు, మోచేతులకు, మెడకు కూడా ఉపయోగించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube