మసాలా చాయ్ తో మజానే కాదు మస్తు ఆరోగ్య లాభాలు కూడా పొందొచ్చు తెలుసా?

చాయ్.ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఫీలింగ్ మనలో కలుగుతుంది.వాటర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయం ఇది.ముఖ్యంగా భారతీయులకు టీ తో విడదీయలేని సంబంధం ఉంది.సంపన్నుల నుంచి అంత్యంత పేదల వరకు అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు.ఉదయం లేవగానే ఒక కప్పు వేడివేడి టీ తాగనిదే కోట్లాది మందికి రోజు కూడా గడవదు.

 Wonderful Health Benefits Of Masala Chai! Masala Chai, Masala Chai Health Benefi-TeluguStop.com

టీలో ఎన్నో రకాలు, మరెన్నో ఫ్లేవర్లు కూడా వచ్చాయి.అయితే ఎక్కువ శాతం మంది మసాలా టీ వైపు మక్కువ చూపుతుంటారు.

మసాలా చాయ్( masala chai ) తో మజానే కాదు మస్తు ఆరోగ్య లాభాలు కూడా పొందవచ్చు.పైగా మసాలా చాయ్ ను తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు.

అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అంగుళం దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి తరిగిన అల్లం ముక్కలు, రెండు దంచిన యాలకులు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Fennel seeds ), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Latest, Masala Chai, Masalachai, Masala Tea-Telugu Health

ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి మరో నాలుగు నిమిషాల పాటు మరిగించి ఫిల్టర్ చేసుకుంటే మన మసాలా చాయ్ సిద్ధం అయినట్లే.ఈ మాసాలా చాయ్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మసాలా చాయ్ ను తప్పకుండా తీసుకోవాలి.ఎందుకంటే మసాలా చాయ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్చ‌ యాంటీ వైరల్చ‌ యాంటీ బ్యాక్టీరియల్చ‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు సమస్యలను సహజంగానే నివారిస్తాయి.

Telugu Tips, Latest, Masala Chai, Masalachai, Masala Tea-Telugu Health

అదే సమయంలో రోగ‌ నిరోధక వ్యవస్థ( Immune System )ను పటిష్టం చేస్తాయి.అలాగే మసాలా చాయ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మసాలా చాయ్ ను తీసుకోవడం వల్ల నొప్పులు మాయమవుతాయి.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి.

తల నొప్పిని క్షణాల్లో మాయం చేయడానికి కూడా మసాలా చాయ్ ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube