ఆరోగ్యంగా, ఫిట్‌గా లైఫ్‌ను లీడ్ చేయాలంటే డైట్‌లో అన్ని పోషకాలు ఉండే ఆహారాలను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.అయితే కొన్ని కొన్ని ఆహారాలు విడి విడిగా కంటే వేరే వాటితో కలిసి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య లాభాలు అందుతుంటాయి.
అలాంటి ఫుడ్ కాంబినేషన్లలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, అరటి పండు.
ఈ రెండూ వేటికవి రుచిగా ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంటాయి.
అయితే పెరుగు, అరటి పండు విడిగా కాకుండా కలిపి తీసుకుంటే.బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, కడుపు మంట, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

నల్లటి ద్రాక్ష పండ్లు, ఉల్లిపాయ కలిపి తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా అధిక రక్త పోటు సమస్యతో బాధ పడేవారు బ్లాక్ గ్రేప్స్‌తో ఉల్లిపాయను కలిపి తినాలి.ఎందుకంటే, ఈ ఫుడ్ కాంబినేషన్‌కు అధిక రక్త పోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం పుష్కలంగా ఉంది.అంతే కాదు, బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలోనూ ఈ ఫుడ్ కాంబినేషన్ సహాయపడుతుంది.
వెల్లుల్లి, తేనెఈ రెండిటినీ కలిపి ఉదయానే తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.కంటి చూపు పెరుగుతుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.
వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి వాటి నుంచి కూడా ఈ ఫుడ్ కాంబినేషన్ ద్వారా ఉపశమనం పొందొచ్చు.ఇక ఇవే కాకుండా ఆకుకూరాలు.
టమాటో, ఎగ్ అండ్ చీజ్, పెరుగు బాదం, పిస్తా.ఎండుద్రాక్ష, గ్రీన్ టీ లెమన్ వంటి ఫుడ్ కాంబినేషన్స్ కూడా ఆరోగ్యానికి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి, తప్పకుండా ట్రై చేయండి.