ఖమ్మం జిల్లా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్ & పోలీస్,రెవెన్యూ , మీడియా టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా సాగింది, గత కొద్ది రోజులుగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఉమెన్ T20 క్రికెట్ లిగ్ 2022 డే&నైట్ క్రికెట్ మ్యాచ్ లకు సందర్భంగా డాక్టర్స్ & పోలీస్ వారియర్ టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కెప్టెన్లు గా పాల్గొన్నారు.టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 158/4 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డాక్టర్ వారియర్ జట్టు పది వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేయడంతో పోలీస్ జట్టు విజయం సాధించింది.
ఇరు జట్లు పోటా పోటీగా తలపడటంతో మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది.అంతకు ముందు మీడియా వర్సెస్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కు జరిగిన పోటీలో మీడియా టీమ్ విజయం సాధించారు.
వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు.
నిత్యం పని వత్తిడిలో ఉండే డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ ,మీడియా వారు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు.ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.